వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు
- కేజీ సీఎన్జీపై రూ.1 పెంపు
- రెండు రోజుల్లో రెండోసారి పెరిగిన ధరలు
- మొత్తంగా రూ.3 అదనపు భారం
- ఢిల్లీలో కేజీ ధర రూ.80.09
వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. సీఎన్జీ ధరలను కేంద్రం మరోసారి పెంచింది. కేజీకి ఒక రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల వ్యవధిలో సీఎన్జీ ధరలు రెండోసారి పెరిగాయి. శుక్రవారం కూడా కేజీ గ్యాస్‌పై రూ.2 చొప్పున పెంచారు. దీంతో మూడు రోజుల వ్యవధిలో సీఎన్జీ వాహనదారులపై రూ.3 అదనపు భారం పడినట్లయింది.
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ ధర కేజీ రూ.80.09కి చేరింది. నోయిడా-గాజియాబాద్ ప్రాంతంలో ఈ రేటు రూ.88.70గా నమోదైంది. ముంబయిలో రూ.84.09కి, హైదరాబాద్‌లో రూ.100కు చేరింది. పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్ జలసంధిలో ఆంక్షల నేపథ్యంలో గ్యాస్, చమురు ట్యాంకర్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ ఉత్పత్తి, సరఫరా దెబ్బతిన్నాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. ఫలితంగా దేశీయంగానూ ధరల పెంపు అనివార్యమైంది.